ప్రజా సమస్యలపై అంకిత భావంతో పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సుభద్ర అధికారులను ఆదేశించారు. శనివారం జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలతో పాటు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ పనులు, ఆర్థిక ప్రణాళికలు, తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచానాల బడ్జెట్‌పై చర్చించారు.