విశాఖ: ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

75చూసినవారు
విశాఖ: ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
విశాఖ లోని షీలానగర్ కు చెందిన బంకురు బాజ్జీ సంక్రాంతి పండుగ నిమిత్తం విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురంలోని పూడివీధికి చెందిన తన బంధువు కునుకు గౌరీశంకర్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం బొబ్బిలిలోని తన మేనకోడలు ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేశారు,

సంబంధిత పోస్ట్