పెందుర్తి: రెవిన్యూ సదస్సులు తర్వాత భూ సమస్యలు ఉండకూడదు

78చూసినవారు
రెవెన్యూ సదస్సులు పూర్తయిన తర్వాత ఎక్కడ భూ సమస్యలు ఉండకూడదని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి మండలం సుజాతనగర్ జనసేన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 6న ప్రారంభమైన సదస్సులు వచ్చేనెల 8వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. భూ ఆక్రమణలు, భూ వివాదాలు రికార్డుల్లో అవకతవకలు తదితర సమస్యలను ఈ సదస్సుల్లో రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు.

సంబంధిత పోస్ట్