గాలి కుంటు వ్యాధి పై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలి

55చూసినవారు
గాలి కుంటు వ్యాధి పై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలి
పాడి పరిశ్రమ అభివృద్ధి కి తీవ్ర విఘాతం గా ఉన్న గాలికుంటు వ్యాధి పశువులలో ఈసుకు పోవడం, పాలదిగుబడి లో తగ్గుదల, పెయ్యల్లో ఆకస్మిక మరణాలు వంటి దుష్ప్రభావాలకు ముఖ్య కారణం. ఈ వ్యాధిపై రోలుగుంట పశువైద్యశాల వద్ద అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేసిన పశువైద్యాధికారి డాక్టర్ నూకేశ్వర రావు రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర ఆరోగ్య సంరక్షణ చర్యలు గూర్చి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్