విశాఖ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి
విశాఖ జిల్లా అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖ మహానగరం ఖ్యాతిని మరింత పెంచేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు.