వీఎంఆర్డీఏ పార్కుల్లో తాగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు
విశాఖలోని కైలాసగిరి, తెన్నేటి పార్క్, వుడా పార్కులకు విచ్చేస్తున్న పర్యాటకుల సౌకర్యార్థం దివీస్ లాబొరేటరీస్ సహకారంతో ఏర్పాటు చేసిన పూర్తి ఆధునిక నీటి శుద్ధి యంత్రాలను బుధవారం ఎంపీ ఎం. శ్రీభారత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విఎంఆర్ డి ఏ కమిషనర్ విశ్వనాథన్ పాల్గొన్నారు.