వెదురుకుప్పం: జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహణ
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలంలో ఆదివారం జనసేన ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్చార్జ్ యుగంధర్ పొన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఆధ్వర్యంలో గొడుగు చింత గ్రామపంచాయతీ సర్పంచ్ మధుసూదన్, చంద్రశేఖర్ తన సహచర బృందంతో జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా నాయకులు యుగంధర్ మాట్లాడుతూ పార్టీ అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.