జీడి నెల్లూరు నియోజక వర్గం కరివేటి నగరం మండలంలోని పిఎల్ చెరువు, అమ్మ చెరువులకు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆదివారం జల హారతి ఇచ్చారు. నియోజకవర్గంలో కృష్ణాపురం జలాశయం ఉండటంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుం దని ఆయన చెప్పారు. జలాశయం నిండితే 6500 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఇప్పటివరకు నాలుగు చెరువులు నిండాయని మరో మూడు చెరువులు నిండాల్సి ఉందని అన్నారు.