గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలోని నీవా నదిపై ఉన్న ఎన్టీఆర్ జలాశయం ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరింది. దీనితొ ఆదివారం రెండు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి అధికారులు నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.