చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం జరిగిన డీఆర్సీ సమావేశంలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చార్వాగానిపల్లి పంచాయతీకి ప్రతిసారి అన్యాయం జరుగుతుందన్నారు. పంచాయతీ పరిధిలోని ఆరు గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని తెలిపారు. అధికారులు పట్టించుకోకపోతే, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.