అనకాపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో నర్సీపట్నం డిప్యూటీ తహశీల్దార్ శ్యామ్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. గురువారం శ్యామ్ కు హోం మంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారు. రెవెన్యూ సమస్యలు పరిష్కారంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు అవార్డు దక్కినట్లు అధికారులు తెలిపారు.