నర్సీపట్నం: కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీపీఐ నిరసన

79చూసినవారు
నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం వద్ద సోమవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విధానాలు నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దారా దత్తం చేస్తుందని ఆరోపించారు. నాయకులు రామ్ నాయుడు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్