నర్సీపట్నం శ్రీ అలివేలు మంగతాయారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ధనుర్మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్ తాడికొండ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో విశ్వ కేశన పూజల అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శరత్ కుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో గోదాదేవిని ఆలయం చుట్టూ ఊరేగించారు. పాశురాలు పారాయణం మొదలుపెట్టారు.