నర్సీపట్నం: గబ్బాడ డిపోలో నేటి నుంచి ఇసుక సరఫరా
నర్సీపట్నం మండలం గబ్బాడ డిపో నుంచి మైనింగ్ ఏడీ శివాజీ, అధికార పార్టీ నాయకులు టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకట రమణ, కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు, డబ్బీర్ శ్రీకాంత్, ఈర్ల రాజబాబు తదితరులు శనివారం ఇసుక సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక నిల్వలపై అధికారులు విచారణ చేపట్టారు. అయితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో మరల ఇసుక డిపో ప్రారంభించారు.