ఈ నెల 13న జాబ్‌మేళా
విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరీర్ సర్వీస్‌లో ఈనెల 13న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఎంప్లాయ్మెంట్ అధికారి శ్యామ్ సుందర్ తెలిపారు. క్రెడ్ రైట్ ఫైనాన్స్, ఇన్నోవ్సోర్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో 120 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్‌మేళాకు అర్హులంతా హాజరుకావాలని కోరారు.