యలమంచిలి రూరల్ ఎస్ఐగా ఎం. ఉపేంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన కేడీపేట ఎస్ఐగా పనిచేస్తూ సాధారణ బదిలీల్లో యలమంచిలి రూరల్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూనే చట్టాన్ని ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాన్నారు.