మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై జిల్లాలోని పాఠశాల, కళాశాలలో, ఐటీఐ, పాలిటెక్నిక్, యూనివర్సిటీలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో (నార్కో కోఆర్డినేషన్ సెంటర్) జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ తో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు.