అనంతపురం: వైసిపి నాయకులతో మడకశిర ఎమ్మెల్యే వాగ్వాదం
అనంతపురంలోని జడ్పీ కార్యాలయంలో 11వ సర్వసభ్య సమావేశం శనివారం వాడివేడిగా జరిగింది. వైసీపీ జడ్పీటీసీలు కూటమి ప్రభుత్వంలో వృద్ధుల పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు తొలగించారని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. దీంతో జ్యోక్యం చేసుకున్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వైసీపీ ప్రభుత్వంలో అనర్హులకు పెన్షన్లు ఇచ్చారని, వాటిని మాత్రమే తొలిగిస్తున్నామన్నారు. కాగా ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.