మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి: ఏఐఎస్ఎఫ్

55చూసినవారు
మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి: ఏఐఎస్ఎఫ్
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు డిమాండ్ చేశారు. గురువారం కళ్యాణదుర్గంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్సన్ బాబు మాట్లాడుతూ.. జిల్లాలోని సెంట్రల్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వాలని, అధ్యాపకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్