అర్థాంతరంగా ఆగిపోయిన పాఠశాల నిర్మాణాన్ని ప్రారంభించాలి

70చూసినవారు
రాయదుర్గం: గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన గురుకుల పాఠశాల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి డిమాండ్ చేశారు. జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు, స్థానిక విద్యార్థి నాయకులతో కలిసి మంగళవారం అర్ధాంతరంగా ఆగిపోయిన నిర్మాణ పనులను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చొరవ తీసుకొని నిర్మాణ పనులు పూర్తిచేసేలా చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్