రాయదుర్గం పట్టణంలోని ముత్రాసి కాలనీకి చెందిన మహిళలు గురువారం తహసీల్దార్ కార్యాలయం ముందు రేషన్ బియ్యం అందించాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రతినెల ప్రభుత్వం అందించే చౌక ధాన్యపు బండ్లు సక్రమంగా మా కాలనీకి రాకపోవడంతో మాకు రేషన్ బియ్యం అందాలంటే దాదాపు 10రోజులు కావస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ బండ్లు పక్కనే ఉన్న కాలనీకి వస్తున్నాయని మా కాలనీకి రావాలంటే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు.