కోల్కతాలో జూనియర్ వైద్యురాలిని హత్య చేసిన ఘటనను నిరసిస్తూ పెద్దపప్పూరులోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారి ఉషారాణి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది గురువారం నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి బాధిత మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలిగేలా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు షర్మాష్ వలి, లక్ష్మీకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.