నార్పల మండలంలోని దగ్గుమర్రి గ్రామంలో రీసర్వే పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. రీసర్వే పకడ్బందీగా చేయాలని, రీసర్వే జట్టు ప్రతి రోజు గ్రామంలో నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సరిహద్దులు, బ్లాక్ సరిహద్దులు, ప్రభుత్వ స్థలాలు సరిహద్దులను పక్కగా నిర్ణయించాలన్నారు. రీ సర్వే గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని, వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేయాలన్నారు