అనంతపురం: మద్యం, ఇసుకలో సీఎం, లోకేష్ లకు వాటాలు ఉన్నాయా?: అనంత
రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని చెప్పిన సీఎం చంద్రబాబు, ఉన్న సంపదను టీడీపీ నేతలకు కట్టబెడుతున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మంగళవారం మండిపడ్డారు. ఇసుక దోపిడీ జరుగుతున్నా, మద్యం పాలసీలో ప్రభుత్వానికి ఆదాయం గండిపడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, లోకేశ్ కు ఇందులో వాటాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.