ధర్మవరం డీఎస్పీగా విధులు నిర్వహించిన శ్రీనివాసులు బదిలీపై వెళ్తుండటంతో బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయనను సన్మానించారు. ఇటీవల డీఎస్పీల బదిలీల్లో భాగంగా ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు బదిలీ అయ్యారు. ఉద్యోగుల బదిలీలు సర్వసాధారణమైనవని, బదిలీపై వెళ్తున్న డీఎస్పీ విధుల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఎస్పీ రత్న సూచించారు.