నూతన సంవత్సర వేడుకలను ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుపుకోవాలని ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ సోమవారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని తెలిపారు. ప్రజలందరూ పోలీస్ నిబంధనలను పాటించాలని అదేవిధంగా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి 10 గంటల తర్వాత తనిఖీలు నిర్వహిస్తామని మద్యం తాగి వాహన డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.