హిందూపురం పట్టణంలోని రహమత్పూర్ లో ఆదివారం రాత్రి ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ. 400 కోసం మేనమామ రఫీక్ గొంతును మేనల్లుడు చాంద్ బాషా కత్తితో కోశాడు. రఫీక్ వద్ద రూ. 400 అడిగినప్పుడు ఇవ్వకపోవడంతో చాంద్ బాషా ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇరుగుపొరుగు వారు చాంద్ బాషాను అడ్డుకున్నారు. గాయపడిన రఫీక్ ను స్థానికులు ఆటోలో వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.