హిందూపురంలో తమ అక్రమ సంబంధం అడ్డుకుంటున్నాడని భావించిన భార్య, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. ఈ నెల 18న అల్లా బకాశ్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భార్య తబుసం, ప్రియుడు నదీముల్లా కలిసి గొంతు నులిమి భర్తను చంపారు. ఈ సంఘటనలో నిందితులను అరెస్ట్ చేసినట్లు హిందూపురం డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ అబ్దుల్ కరీం తెలిపారు. వారిని రిమాండ్ కు తరలించారు.