కదిరి: పురుగుల అన్నం పెడుతున్నారని రోడ్డెఎక్కిన విద్యార్థులు

85చూసినవారు
కదిరి పట్టణంలోని డిగ్రీ కళాశాల పక్కన ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలో ప్రతి రోజు పురుగులున్న భోజనం పెడుతున్నారని విద్యార్థులు గురువారం రోడ్డెక్కారు. ఈ సందర్బంగా రోడ్డు పై బైఠాయించి ఆందోళన చేపట్టిన విద్యార్థులకు ఆర్ యు ఎస్ జిల్లా అధ్యక్షులు సగినాల చరణ్ మద్దతుగా నిలిచి సమస్యను సంబంధిత అధికారులకు తెలిపారు. విషయం తెలుసుకున్న సీఐ అక్కడికి చేరుకొని సర్ది చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ యు నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్