శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలం శెట్టిపల్లికి చెందిన ప్రమీల భాయ్ తన భర్త ఆర్మీ సైనికుడు శ్రీరామ్ నాయక్ బ్యాంకు అకౌంట్లో సైబర్ నేరగాళ్లు రూ.7లక్షల నగదు దోచేశారని పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ రత్నకు ఆమె వినతిపత్రం అందించారు. సెప్టెంబర్ 30న రూ.10 రీఛార్జ్ చేసుకోవాలని ఫోన్ వచ్చిందన్నారు. వారు చెప్పిన యాపైపై క్లిక్ చేయగా అకౌంట్లోని డబ్బు మొత్తం బదిలీ అయిందని తెలిపారు.