వెంకటాపురం: భక్త కనకదాస జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే

80చూసినవారు
వెంకటాపురం: భక్త కనకదాస జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే
రామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలో సోమవారం కురువలు నిర్వహించిన భక్త కనకదాస జయంతి వేడుకల్లో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటాపురం గ్రామంలోని 36 కురువ కులస్తుల కుటుంబాలకు పరిటాల సునీత చేతుల మీదుగా కమ్మలను అందజేశారు. అనంతరం గ్రామ దేవత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలను కార్యకర్తలను ఆమె ఆప్యాయంగా పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్