రాయదుర్గం: నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే
రాయదుర్గం పట్టణంలోని ఆర్టీసీ సర్వీస్ బస్సులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం ఆర్టీసీ డిపోలో నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం మొదలై 100రోజుల్లోనే ఏడు బస్సులను ప్రారంభించామన్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అనుగుణంగా అధిక బస్సులను రాయదుర్గం డిపోకు తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు.