రాయదుర్గం: మానవతా హృదయంతో స్పందించి సాయం చేయండి
రాయదుర్గం పరిధిలో 21వ వార్డు మారెమ్మగుడి వెనక కొండ పక్కన ఉన్న ఏరియాలో దయనీయ పరిస్థితుల్లో ఉన్న ఓ అనాధ మహిళ పరిస్థితిని చూసి స్థానికులు ఆమె గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉందని, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని, కాలనీవాసులు ఒక్కొక్కరు ఒక్కొక్క పూట అన్నం ఇస్తూ చూసుకుంటున్నారు. వర్షం కారణంగా ఆమె దయనీయ పరిస్థితిని చూసి పక్కన ఒక కొట్టం వేసి ఇచ్చారు. దాతలు మానవతా హృదయంతో స్పందించి ఆమెకు సహాయం చేయాలనీ కోరుతున్నారు.