తాడిపత్రిలో పర్యటించిన కేంద్ర పారా మిలిటరీ బలగాలు

61చూసినవారు
అనంతపురం జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన తాడిపత్రిలో కేంద్ర పారా మిలిటరీ బలగాలు పర్యటించాయి. తాడిపత్రి డిఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో గురువారం పట్టణ సీఐ మురళీకృష్ణ, ఎస్సై గౌస్ బాషాలు కేంద్ర పారా మిలిటరీ బలగాలతో నంద్యాల రోడ్డు, సీపీఐ కాలనీ, పోరాట కాలనీ, చిన్న బజార్, మెయిన్ బజార్ ప్రాంతాల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్