తాడిపత్రి తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన రజాక్

83చూసినవారు
తాడిపత్రి తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన రజాక్
తాడిపత్రి మండల తహసీల్దార్ గా రజాక్ వలీ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఉత్తర్వులు మేరకు తాడిపత్రి తహాసిల్దార్ కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తూ బదిలీపై తాడిపత్రికి రావడం జరిగిందన్నారు. మండలంలోని రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్