కార్తీకమాసం నాల్గొవ సోమవారం పురస్కరించుకుని తాడిపత్రి పట్టణ సమీపంలోని పెన్నా నది తీరాన వెలసిన శ్రీబుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం ఆవరణలో సోమవారం రాత్రి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా లక్ష దీపాలతో నటరాజస్వామి ఆకృతిలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహా లింగేశ్వరునికి మహానీరాజనం చేశారు. అనంతరం నిర్వహించిన సాంసృకతిక భరత నాట్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది.