కార్తిక మాసం సందర్భంగా తాడిపత్రిలోని పురాతన బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో లక్ష బిల్వ పుష్పార్చన పూజల్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి అభిషేక పూజలు, అర్చనలు, మహా మంగళహారతులు నిర్వహించారు. వేదపండితులు బిల్వ పుష్పార్చన పూజల్ని ఘనంగా నిర్వహించి స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.