తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పై మండిపడుతూ, ఆయన మున్సిపాలిటీ అభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా బూడిద గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేశ్‌పై అవాకులు చవాకులు చెప్పితే, ఇంటికి వచ్చి తంతానని హెచ్చరించారు.