జీవో 117 ని రద్దు చేయాలని నిరసన ప్రదర్శన
కదిరిలో (డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జీవో 117 ని రద్దు చేయాలని మాతృభాష మాధ్యమం అమలు కోసం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి షర్ఫోద్ధీన్, జిల్లా అధ్యక్షుడు గౌస్ లాజమ్, జీవో 117 రద్దు చేస్తూ ఆంగ్ల భాష మాధ్యమంతో పాటు మాతృభాషా మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.