గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నేడు పాఠశాలలకు సెలవు
వాతావరణ శాఖ వారి హెచ్చరికల నేపథ్యంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నెల14 వ తేదీ సోమవారం అన్ని పాఠశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ప్రజలు అధికారులు సూచనలను పాటించాలని సూచించారు.