కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం మున్సిపల్ సిబ్బంది పట్టణములోని పలు దుకాణాలలో ప్లాస్టిక్ వాడకంపై దాడులు చేసి ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేశారు. వారికి ఫైన్ విధించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎదురయ్యే దుష్పరిమానాలను వివిధ వ్యాపార దుకాణాల యజమానులకు అర్థవంతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.