రామసముద్రం మండల మాలమహానాడు అధ్యక్షుడుగా మట్లవారి పల్లెకు చెందిన టి. కృష్ణప్పను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు యమలా సూదర్శనం తెలిపారు. మండల కేంద్రంలోని టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన సమావేశంలో అధ్యక్షునితో పాటు కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో గౌరవ అధ్యక్షులుగా కొమ్ము నారాయణస్వామి, ఉపాధ్యక్షులుగా కె. వెంకటేష్, రమనప్ప, ప్రధాన కార్యదర్శి గా ఎన్ శివ, ఎన్నుకున్నారు.