గుండెపోటుతో మండలం పాలనాధికారి మృతి

71చూసినవారు
గుండెపోటుతో మండలం పాలనాధికారి మృతి
రామసముద్రం మండలం ఎంపీడీవో కార్యాలయంలో పరిపాలన అధికారిగా పనిచేస్తున్న బి.రమణ(58) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం వాకింగ్ కు వెళ్లి వచ్చినా ఆయన ఇంట్లో కుప్ప కూలి పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే వైద్య శాలకు తరలించే లోపు ఆయన మృతి చెందారు. కాగా కరోనా సమయంలో అతని భార్య కుమారుడు కూడా మృతి చెందారు. ఆయన మృతి పట్ల ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్