టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అవుతున్న సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని శుక్రవారం రామసముద్రం జడ్పీటీసీ రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాణ్యత లేని మద్యాన్ని టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంచెలంచెలుగా మద్యం నిర్మూలనకి కృషి చేశారన్నారు. టీడీపీ ప్రజలను నమ్మించి వంచిస్తుందన్నారు.