ప్రొద్దుటూరులో ఓ స్వచ్చంద సేవా సంస్థ ఆద్వర్యంలో ఆదివారం స్థానిక వాసవి కళ్యాణ మండపంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 700 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. తిరుపతిలోని ఓ ఆసుపత్రి సౌజన్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగానే కంటి ఆపరేషన్లు చేస్తామని అన్నారు.