ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తొలిసారి కడప జిల్లాకు రానున్నారు. ఈనెల 29వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రొద్దుటూరులో జిల్లా కార్యకర్తల సమావేశం, నగర ప్రముఖులతో సమావేశం ఉంటుంది. 30వ తేదీ ఉదయం ప్రొద్దుటూరు సర్వజన ఆసుపత్రి పర్యటన అనంతరం, కడప రిమ్స్ ఆసుపత్రిలో ఆడిటోరియం, ల్యాబ్లను ప్రారంభిస్తారు. కడప నగరంలో పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారని శనివారం అధికారులు తెలిపారు.