తప్పిపోయిన 13 ఏళ్ల బాలిక రోషిణి ఆచూకీని రాయచోటి పట్టణ పోలీసులు, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్ మరియు సిబ్బంది కనుగొన్నారు. బుధవారం ఉదయం బాలిక కనపడకపోవడంతో తల్లి దండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. గంటల వ్యవధిలోనే బాలికను గుర్తించి, తమ కుమార్తెను అప్పగించిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ జగన్ కూడా పాల్గొన్నారు.