పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని ఓడించిన ఒకే ఒక్క వ్యక్తిని తానేనని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. ఆదివారం వేంపల్లిలో ఆయన మాట్లాడారు. వీఆర్వోలను ఎమ్మర్వో ఆఫీస్లో నిర్బంధించి ఎలక్షన్స్ జరుపుకున్నారని ఎంపీ ఆరోపించారని గతంలో వైసీపీ పాలనలో సాగునీటి సంఘాలను ఇలాగే ఏకగ్రీవం చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సతీశ్ రెడ్డి టీడీపీ లో ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారా లేదా అని ప్రశ్నించారు.