నగిరి: మంత్రికి వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే
సంక్రాంతి సందర్భంగా చంద్రగిరి సమీపంలోని నారావారిపల్లె పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కు బుధవారం సాయంత్రం నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తమ సహచర ఎమ్మెల్యేలతో కలిసి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనుల గురించి మంత్రికి తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.