రైల్వే కోడూరు నియోజకవర్గంలో మామిడి పంట విస్తారంగా సాగులో ఉందని, అనంతరాజు పేట అప్స జ్యూస్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ను గురువారం నియోజకవర్గం టిడిపి బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి కోరారు. స్పందించిన మంత్రి అతి త్వరలో చర్యలు తీసుకుంటామని, వ్యవసాయ హబ్బుగా కోడూరును మార్చడానికి స్పష్టమైన హామీ ఇచ్చారని రూపానంద రెడ్డి తెలిపారు.